ramya
రచయిత
చేపలు కోయడంలో కలెక్టర్ డెమో: ఆదాయానికి కొత్త మార్గాలు సూచించిన జితేష్ పాటిల్
ramya
రచయిత
చేపలు కోయడంలో కలెక్టర్ డెమో: ఆదాయానికి కొత్త మార్గాలు సూచించిన జితేష్ పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరోసారి తన వినూత్న పనితీరుతో ఆకట్టుకున్నారు. ఇటీవల స్థానిక మత్స్యకారులతో కలిసి బోన్‌లెస్ చేపల తయారీపై ప్రత్యక్షంగా ప్రాక్టికల్ డెమో ఇచ్చారు. చేపలను ముళ్లు లేకుండా తయారు చేయడం ద్వారా వాటికి మార్కెట్లో అధిక విలువ దక్కుతుందని, ఇది మత్స్యకారులు, ఆదివాసీలు, SHG మహిళలు వంటి వర్గాలకు ఆదాయాన్ని పెంచే మార్గమవుతుందని తెలిపారు. బోన్‌లెస్ చేపలు పిల్లలు, వృద్ధులు సులభంగా తినగలవు కాబట్టి వీటిని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అంతేకాదు, చికెన్ టిక్కా తరహాలో చేపలతో రకరకాల వంటకాలు తయారుచేసి వినియోగదారులకు కొత్త రుచులను పరిచయం చేయవచ్చన్నారు. చేపల తలలు, మిగిలిన భాగాలతో పోషక విలువ గల సూప్‌లు తయారు చేసి ప్రజలకు అందించడం ద్వారా ఆరోగ్యం, ఆదాయం రెండూ సాధించవచ్చునన్నారు. మిగిలిన వ్యర్థాలను ఎరువుగా వాడితే పర్యావరణ పరిరక్షణతో పాటు అదనపు లాభాలు పొందొచ్చని తెలిపారు. జిల్లాలో ఈ బోన్‌లెస్ చేపల తయారీని ప్రోత్సహిస్తూ, మరింత మంది లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు Collector జితేష్ పాటిల్ ఆదేశాలు జారీ చేశారు.