R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గంటలోపు ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ అవకాశం ఎక్కువ!
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గంటలోపు ఫిర్యాదు చేస్తే సొమ్ము రికవరీ అవకాశం ఎక్కువ!

రాజమహేంద్రవరం: సైబర్ మోసాల నుంచి నష్టాలు తప్పించుకోవాలంటే మొదటి గంటలోపు ఫిర్యాదు చేయడం చాలా కీలకం. దీనినే పోలీసులు ‘గోల్డెన్ అవర్’గా చెబుతున్నారు. బాధితులు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్ లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలి. వివరాలు అందిన వెంటనే సైబర్ సెల్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా డబ్బు మళ్లిన ఖాతాలను గుర్తించి, ఆఖరిదైన ఖాతాను నిలుపుదల చేస్తుంది. కోర్టు అనుమతి ద్వారా ఆ సొమ్మును తిరిగి రికవరీ చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల ప్రకాశం నగర్‌లో ఓ విశ్రాంత ఉద్యోగి మోసానికి గురై రూ.8.5 లక్షలు కోల్పోయాడు. కానీ వెంటనే ఫిర్యాదు చేయడంతో చివర్లో పంపిన రూ.3.5 లక్షలు రికవరీ అయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అనుమానాస్పద కాల్స్, లింకులను నమ్మకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi