Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాల వల్ల కాదన్న కేంద్రం
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఆకస్మిక మరణాలకు కొవిడ్ టీకాల వల్ల కాదన్న కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా అనంతరం ఆకస్మిక మరణాలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, వాటికి కొవిడ్ వ్యాక్సిన్లతో ఎలాంటి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఐసీఎంఆర్, ఎయిమ్స్, ఎన్‌సీడీసీ సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనాల్లో ఈ విషయాన్ని తేల్చారు. 18-45 ఏళ్ల మధ్య వయసు గలవారిలో 2021 అక్టోబర్ నుంచి 2023 మార్చి మధ్య జరిగిన అనూహ్య మరణాలపై 19 రాష్ట్రాల్లో అధ్యయనం జరిగింది. ఈ మరణాలకు టీకాలు కారణమయ్యాయని నిరూపించే ఆధారాలేమీ లేవని స్పష్టం చేశారు. జన్యుపరమైన సమస్యలు, జీవనశైలి, మునుపటి అనారోగ్యాలే ప్రధాన కారణాలుగా గుర్తించారు. అలాగని టీకాలపై తప్పుడు ప్రచారాలు చేయడం ప్రమాదకరమని, అవి ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసే అవకాశముందని కేంద్రం హెచ్చరించింది. టీకాల వల్ల కోవిడ్ సమయంలో లక్షలాది ప్రాణాలు రక్షించబడ్డాయని గుర్తుచేశారు.
ట్యాగ్‌లు
TrendingKranthi NewsKranthi News Telugutrending news