R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ బీజేపీ ఖరారు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ బీజేపీ ఖరారు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్  బీజేపీ ఖరారు

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను బీజేపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఢిల్లీలోని బాలయోగి ఆడిటోరియంలో జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా తదితరులు హాజరయ్యారు. సభలో రాధాకృష్ణన్‌ను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు. టీడీపీ ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సహకరించాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు ఇంకా రెండు రోజుల గడువు ఉంది. సెప్టెంబర్ 9న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలు వెలువడతాయి. విజయం కోసం 394 ఓట్లు అవసరం. కాంగ్రెస్ సహా ప్రతిపక్షం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆసక్తి నెలకొంది

ట్యాగ్‌లు

AgriKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi