L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జన్నారం కేంద్రంగా సైబర్ మోసాలు – నలుగురు అరెస్ట్, జాక్ పరారిలో
L
Lahari
రచయిత
1 నిమిషాలు చదవడానికి
జన్నారం కేంద్రంగా సైబర్ మోసాలు – నలుగురు అరెస్ట్, జాక్ పరారిలో

మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో భారీ స్థాయిలో సైబర్ మోసాలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించి, నలుగురిని అరెస్ట్ చేశారు. వోడాఫోన్ ఐడియా టవర్ పరిధిలో అనుమానాస్పద సిమ్‌కార్డుల నుంచి వేల కొద్ది కాల్స్ వెళ్తున్నట్లు గుర్తించిన టెలికం శాఖ సమాచారం మేరకు, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, రామగుండం పోలీస్‌శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయి. జగిత్యాలకు చెందిన బాపయ్య, సోదరుడు మధుకర్, బావ రాజేష్, మన్యం జిల్లా నుంచి వచ్చిన కామేశ్ కలిసి, అద్దె ఇంట్లో పరికరాలు అమర్చి సైబర్ మోసాలకు పాల్పడ్డారు. వీరు దాదాపు 256 సిమ్‌కార్డుల ద్వారా రోజూ వేల మంది వ్యక్తులకు రికార్డెడ్ కాల్స్ చేస్తూ మోసాలు కొనసాగించినట్లు అనుమానం. ఈ వ్యవహారంలో మోసాల మాస్టర్‌మైండ్ జాక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news