R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం తగ్గుదల

హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం తగ్గుదల

హైదరాబాద్‌లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వినియోగం తగ్గుదల

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు ఎక్కువగా వ్యక్తిగత వాహనాలనే ఎంచుకుంటున్నారు. కన్సల్టెన్సీ రిపోర్ట్ ప్రకారం 2011లో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాటా 42% ఉండగా, 2024 నాటికి 25%కి పడిపోయింది. అదే సమయంలో కార్ల సంఖ్య 4 లక్షల నుంచి 24 లక్షలకు, బైకులు 33 లక్షల నుంచి 69 లక్షలకు పెరిగాయి. బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెద్దగా పెరగకపోవడంతో శాతం తగ్గిపోయింది. ఎంఎంటీఎస్‌ ప్రయాణికులు గణనీయంగా తగ్గగా, మెట్రో, ట్యాక్సీల్లో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించింది. ప్రస్తుతం నగర రవాణాలో 70% మంది వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతుండడంతో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi