ritesh
రచయిత
ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్‌పై ఆగ్రహించిన దీపికా పదుకోన్ కుమార్తె దువా ఫోటోలు లీక్!
ritesh
రచయిత
ఎయిర్‌పోర్ట్‌లో ఫ్యాన్‌పై ఆగ్రహించిన దీపికా పదుకోన్ కుమార్తె దువా ఫోటోలు లీక్!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో తన కుమార్తె దువాతో కనిపించారు. అయితే ఈ సందర్భంలో ఒక అభిమాని ఆమె ప్రైవసీని ఉల్లంఘిస్తూ, దువా ఫోటోలు సీక్రెట్‌గా తీశాడు. దీన్ని గమనించిన దీపిక వెంటనే అతడిని ఆపుతూ, తీసిన ఫోటోలు-వీడియోలు డిలీట్ చేయాలని కోరారు. కానీ ఆ వ్యక్తి మాట వినకుండా వాటిని నెట్టింట షేర్ చేయడంతో, దీపిక తీవ్రంగా ఆవేదన చెందారు. 2018లో పెళ్లి చేసుకున్న దీపికా-రణవీర్ సింగ్ జంటకు 2024 సెప్టెంబర్ 8న కుమార్తె జన్మించింది. ఆమెకు “దువా” అనే పేరు పెట్టారు. పుట్టినప్పటి నుంచి దంపతులు తమ కుమార్తె ముఖాన్ని బయటపెట్టకుండా, ప్రైవసీని కాపాడేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజా ఘటనపై అభిమానులు కూడా దీపికకు మద్దతు తెలుపుతూ – “పేరెంట్స్ అనుమతి లేకుండా చిన్నారి ఫోటోలు పంచుకోవడం తప్పు” అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు బాలీవుడ్‌లో కొత్తేమి కావు. ఇటీవలే హీరోయిన్ ఆలియా భట్ కూడా తన ఇంటి ఆవరణలోకి వచ్చిన ఫోటోగ్రాఫర్లపై అసహనం వ్యక్తం చేశారు.