Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా: సుప్రీంకోర్టు డిస్మిస్
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రేవంత్‌రెడ్డిపై పరువునష్టం దావా: సుప్రీంకోర్టు డిస్మిస్

న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై దాఖలైన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ రేవంత్‌రెడ్డి ప్రచారం చేశారనే కారణంతో భాజపా పిటిషన్ వేసింది. అయితే గత నెలలో హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేయగా, ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ భాజపా సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తాజాగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విని పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. రాజకీయ అంశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. అలాగే రాజకీయ నాయకులకు సున్నితమైన మనసు ఉండకూడదని, కోర్టులను రాజకీయ యుద్ధ భూములుగా మలచకూడదని వ్యాఖ్యానించింది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthirevanth reddy

