ashok
రచయిత
చనిపోయిన వారి ఆధార్ కార్డుల డీయాక్టివేషన్‌లో ఆలస్యం .. దుర్వినియోగానికి అవకాశాలు!
ashok
రచయిత
చనిపోయిన వారి ఆధార్ కార్డుల డీయాక్టివేషన్‌లో ఆలస్యం .. దుర్వినియోగానికి అవకాశాలు!

దేశంలో ఆధార్ కార్డు ప్రధాన గుర్తింపుగా మారినప్పటికీ, చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్ కాకుండా లక్షల సంఖ్యలో యాక్టివ్‌గా ఉండిపోతున్నాయి. యూఐడీఏఐ తాజాగా ఇచ్చిన సమాచారం ప్రకారం 2024 చివరి వరకు కేవలం 1.14 కోట్ల ఆధార్ కార్డులు మాత్రమే రద్దయ్యాయి. కానీ ప్రతి ఏడూ సగటున 83 లక్షల మరణాలు నమోదవుతుండగా.. ఇప్పటివరకు లక్షల మంది చనిపోయినప్పటికీ వారి ఆధార్ నంబర్లు ఇంకా డేటాబేస్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన కారణాలు: మరణ ధ్రువీకరణ కోసం రాష్ట్రాల నుంచి డేటా సేకరణ ఆలస్యం. పేరుల పొంతన లేకపోవడం. కుటుంబ సభ్యులు సమాచారం అందించకపోవడం. యూఐడీఏఐ చర్యలు: ‘మై ఆధార్’ పోర్టల్‌లో మరణ నివేదిక ఫీచర్ ప్రారంభం. 100 ఏళ్లు దాటిన వారి ఆధార్ వివరాలు వెరిఫికేషన్‌కు పంపిణీ. బ్యాంకులు, ఇతర సంస్థల నుంచి మరణ రికార్డులు సేకరించే యోచన. దేశ జనాభా కన్నా ఎక్కువగా ఆధార్ కార్డులు ఉండటం, కొన్ని జిల్లాల్లో ఆధార్ సాచురేషన్ రేటు 120% దాటడం ఆందోళన కలిగిస్తోంది. దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు ఆధార్ డీయాక్టివేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.