Lahari
రచయిత
ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని అదృశ్యం – స్నేహా మిస్సింగ్ కేసు కలకలం
Lahari
రచయిత
ఢిల్లీ వర్సిటీ విద్యార్థిని అదృశ్యం – స్నేహా మిస్సింగ్ కేసు కలకలం

ఢిల్లీ వర్సిటీలో చదువుతోన్న త్రిపురకు చెందిన 19 ఏళ్ల విద్యార్థిని స్నేహా దేవ్‌నాథ్ జూలై 7న నుంచి కనిపించకుండా పోయింది. ఆమె చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసి సరాయి రోహిల్లా స్టేషన్‌కు వెళ్తున్నానని చెప్పింది. అనంతరం సిగ్నేచర్ బ్రిడ్జ్ వద్ద క్యాబ్ డ్రైవర్ ఆమెను దింపినట్టు చెబుతుండగా, అక్కడి సీసీటీవీ ఫుటేజ్ అస్పష్టంగా ఉండటంతో పోలీసులకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. ఈ ఘటనపై త్రిపుర సీఎం మాణిక్ సాహా తీవ్రంగా స్పందించడంతో, ఢిల్లీ పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు కలిసి గాలింపు చేపట్టారు. 7 కిలోమీటర్ల పరిధిలో భారీగా గాలించినా ఇప్పటివరకు ఆమె ఆచూకీ తెలియలేదు. ఇక స్నేహ రాసిన సూసైడ్ నోట్ పట్ల ఆమె కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. "అది అసాధారణంగా చిన్నదిగా ఉంది, పూర్తి సమాచారం లేదు" అని ఆమె అక్క పేర్కొన్నారు. అలాగే, గత నాలుగు నెలలుగా బ్యాంక్ ఖాతాలో ఎటువంటి లావాదేవీలు జరగకపోవడం కేసును మరింత గంభీరంగా మారుస్తోంది. స్నేహా గురించి సమాచారం అందించిన వారికి సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరుతున్నారు. ప్రస్తుతం ఈ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.