ramya
రచయిత
ఎయిరిండియాకు DGCA గట్టి వార్నింగ్ – రికార్డుల్లో తప్పుడు సమాచారం, ఇంజిన్ లోపాలు
ramya
రచయిత
ఎయిరిండియాకు DGCA గట్టి వార్నింగ్ – రికార్డుల్లో తప్పుడు సమాచారం, ఇంజిన్ లోపాలు

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. DGCA నిర్వహించిన తనిఖీల్లో A320 విమానాల్లో అవసరమైన ఇంజిన్ భాగాలు మార్చకపోవడం, రికార్డుల్లో తప్పుడు వివరాలు నమోదు చేయడం వంటి గంభీరమైన లోపాలు బయటపడ్డాయి. యూరోపియన్ యూనియన్ భద్రతా ప్రమాణాలు పాటించలేదని DGCA గుర్తించింది. VT-ATD అనే విమానంలో ఇంజిన్ భాగాల మార్పు జరగలేదని auditలో తేలింది. దీనిపై స్పందించిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, లోపాలు గుర్తించిన వెంటనే మార్పులు చేశామని, బాధ్యులను పదవీ నుండి తొలగించినట్టు తెలిపింది. భద్రతా అంశాలలో ఇటువంటి నిర్లక్ష్యం తీవ్ర ప్రమాదాలకు దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2023లో మొత్తం 23 భద్రతా ఉల్లంఘనలపై ప్రభుత్వం చర్యలు తీసుకుందనీ, ఇందులో 11 కేసులు ఎయిరిండియాతో సంబంధమున్నవేనని సమాచారం.