L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

భారతీయ టెకీలను నియమించొద్దు – ట్రంప్ హెచ్చరిక

భారతీయ టెకీలను నియమించొద్దు – ట్రంప్ హెచ్చరిక

భారతీయ టెకీలను నియమించొద్దు – ట్రంప్ హెచ్చరిక

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజాలైన గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ కంపెనీలకు కీలక సూచనలు చేశారు. విదేశీ ఉద్యోగుల నియామకాన్ని ఆపాలని, ముఖ్యంగా భారతీయ టెకీలను తీసుకోవద్దని ఆయన అన్నారు. వాషింగ్టన్‌లో జరిగిన ఒక ఏఐ సదస్సులో మాట్లాడిన ట్రంప్, అమెరికా కంపెనీలు దేశీయ ఉద్యోగాలపై దృష్టి పెట్టాలన్నారు. విదేశాల్లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడం, భారతదేశం వంటి దేశాల నుంచి టెకీలను రిక్రూట్ చేయడం వల్ల అమెరికన్లు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారన్నారు. గ్లోబల్ మైండ్‌సెట్‌ను తప్పుపడుతూ, అత్యధిక లాభాలు గడిస్తున్న టెక్ కంపెనీలు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయని విమర్శించారు. తన పాలనలో ఇలాంటి విధానాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi