ritesh
రచయిత
షుగర్ ఉందని డిన్నర్ మానేస్తున్నారా? శరీరంపై జరుగుతున్న ప్రభావాలు తెలుసుకోండి!
ritesh
రచయిత
షుగర్ ఉందని డిన్నర్ మానేస్తున్నారా? శరీరంపై జరుగుతున్న ప్రభావాలు తెలుసుకోండి!

ఈ మధ్య శరీర బరువు పెరిగిన వారు లేదా షుగర్ ఉన్నవారు సన్నబడేందుకు రాత్రి భోజనాన్ని మానేస్తున్నారు. కానీ ఇది శరీరంపై అనేక సమస్యలకు దారితీస్తోంది అని వైద్యులు చెబుతున్నారు. ప్రత్యేకంగా రాత్రి ఆహారం మానేయటం వల్ల మెటబాలిజం మందగించడంతో పాటు, శక్తి తగ్గిపోయి అలసట, ఒత్తిడి, తలనొప్పి వంటి లక్షణాలు ఉత్పన్నమవుతాయి. డిన్నర్ మానేయడం వలన రాత్రి సమయంలో బ్లడ్ షుగర్ లెవల్స్ గణనీయంగా తగ్గిపోతాయి. దీని ప్రభావంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ మారిపోతుంది. దీర్ఘకాలంలో ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారితీయొచ్చు. అలాగే శరీరానికి కావలసిన ప్రోటీన్ అందకపోవడం వల్ల మసిల్స్ నష్టం జరుగుతుంది. శరీరం బలంగా ఉండాలంటే రాత్రి సరైన ఆహారం అవసరం. ముఖ్యంగా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్స్, మినరల్స్ వంటి పోషకాలు డిన్నర్ ద్వారానే సమకూరుతాయని వైద్యులు సూచిస్తున్నారు. దీనిని మానేయటం వలన క్యాల్షియం, ఐరన్, బీ-విటమిన్స్ కొరతలు ఏర్పడి ఆరోగ్య సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది. కాబట్టి బరువు తగ్గాలంటే డిన్నర్ మానేయడం కాదు, బదులుగా తక్కువ మోతాదులో, పోషకాలను సమపాళ్లలో తీసుకునే అలవాటు ఏర్పరుచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.