yakub
రచయిత
తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్నారా?: సీఎం చంద్రబాబు విమర్శ
yakub
రచయిత
తప్పుడు ప్రచారాలతో రాజకీయం చేద్దామనుకుంటున్నారా?: సీఎం చంద్రబాబు విమర్శ

కుప్పంలో మీడియాతో మాట్లాడిన సీఎం చంద్రబాబు, తప్పుడు ప్రచారాలు తాత్కాలికమని, కానీ అభివృద్ధి పనులు శాశ్వతమని అన్నారు. ‘‘కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్లలా పక్కన పడేసి వెళ్తారా? ఇది మానవత్వమా?’’ అంటూ విమర్శలు గుప్పించారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయ ప్రయోజనాలకు వాడాలనుకుంటున్నారా? అంటూ తేల్చేశారు. బనకచర్ల ప్రాజెక్టుపై మాట్లాడుతూ — గోదావరిలో ఏటా వృథాగా సముద్రంలోకి పోతున్న 200 టీఎంసీలను వినియోగిస్తే తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ఏ ప్రాజెక్టును కూడా వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. రైతులకు మద్దతుగా — హంద్రీనీవాకు రూ.3,950 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. మైక్రో ఇరిగేషన్‌కు 90% సబ్సిడీ, వాణిజ్య పంటలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడిపై వ్యాఖ్యలు – గత ప్రభుత్వం ఒక్క బిడ్డకే ఇచ్చిన అమ్మఒడిని, తాము తల్లిని గౌరవిస్తూ అన్ని పిల్లలకు వర్తించేలా ఇస్తున్నామని తెలిపారు. చంద్రబాబు మాటల్లో — అభివృద్ధి ప్రయోజనాలే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టమవుతోంది.