Lahari
రచయిత
దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా – ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో ఎంగేజ్మెంట్
Lahari
రచయిత
దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా – ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో ఎంగేజ్‌మెంట్

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భర్తకు విడాకులు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన దుబాయ్ యువరాణి షేక్ మెహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తూమ్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ఆమె అమెరికన్ ర్యాపర్ ఫ్రెంచ్ మోంటానాతో నిశ్చితార్థం (Engagement) జరిగినట్లు ర్యాపర్ ప్రతినిధులు ధృవీకరించారు. 2023 మేలో దుబాయ్ వ్యాపారవేత్తను షేక్ మెహ్రా వివాహం చేసుకోగా, అదే ఏడాది వారికి ఓ పాప కూడా జన్మించింది. అయితే కొన్ని నెలలకే భర్త ఇతర మహిళలతో సన్నిహితంగా ఉన్నాడని ఆరోపిస్తూ, 2023 జూలైలో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా విడాకులు ప్రకటించారు. ఈ పోస్టు అప్పట్లో విపరీతంగా వైరల్ అయింది. విడాకుల తర్వాత మెహ్రా, ఫ్రెంచ్ మోంటానా పబ్లిక్‌గా కలసి తిరుగుతూ మీడియాలో హైలైట్ అయ్యారు. పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జంటగా కనిపించడంతో వీరిద్దరి రిలేషన్‌పై ఊహాగానాలు మరింత పెరిగాయి. ఇప్పుడు ఎంగేజ్మెంట్ జరగడంతో ఆ వార్తలు నిజమయ్యాయి.