ramya
రచయిత
ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగాలి: వైవీ సుబ్బారెడ్డి డిమాండ్
ramya
రచయిత
ఎన్నికలు బ్యాలెట్ పద్ధతిలో జరగాలి: వైవీ సుబ్బారెడ్డి డిమాండ్

వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రతినిధులు గురువారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల విధానంపై అనేక అంశాలు ప్రస్తావించారు. వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, 2024లో జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలపై అనేక అనుమానాలు వచ్చాయని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంల ఓట్లు, వివీప్యాట్‌ల సరిపోలడం లేదని అభిప్రాయపడ్డారు. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత ఏపీలో అనూహ్యంగా 50 లక్షలకు పైగా ఓట్లు పోలయ్యాయని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విజయనగరం పార్లమెంట్, హిందూపురం నియోజకవర్గాల్లో ఓటింగ్ లో తేడాలు కనిపించాయని పేర్కొన్నారు. సీసీ టీవీ ఫుటేజ్ కోరినా ఎన్నికల సంఘం నిరాకరించిందని విమర్శించారు. పారదర్శకత లేకపోవడమే కారణంగా, భవిష్యత్తులో ఎన్నికలు బ్యాలెట్ పేపర్ పద్ధతిలో జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాక, ఏపీలో బీహార్ మాదిరిగా స్పెషల్ ఓటరు రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహించాలని కోరగా, ఎన్నికల సంఘం అందుకు అంగీకరించినట్లు తెలిపారు. చివరిగా, తాము ఎలాంటి కూటమిలో లేమని, పార్టీ అధినేత జగన్ ఆదేశాలతోనే ఎన్నికల సంఘం ఎదుట తమ అభిప్రాయాలు వెల్లడించినట్లు వెల్లడించారు.