Lahari
రచయిత
ఇంగ్లాండ్ గాయాలు – అది వారి సమస్యే: అశ్విన్
Lahari
రచయిత
ఇంగ్లాండ్ గాయాలు – అది వారి సమస్యే: అశ్విన్

భారత్‌తో ఐదో టెస్టులో క్రిస్ వోక్స్ గాయంతో జట్టుకు దూరం కావడంతో, ఇంగ్లాండ్ పది మంది ఆటగాళ్లతోనే బరిలోకి దిగుతోంది. దీనిపై టీమ్‌ఇండియా మాజీ ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ స్పందిస్తూ, "ఇది ఇంగ్లాండ్ సమస్య.. భారత్ ఫోకస్ మాత్రం పరుగులపై ఉండాలి" అని స్పష్టం చేశారు. బౌలింగ్‌లో వోక్స్ లేకపోవడంతో అట్కిన్సన్, టంగ్ లాంటి పేసర్లపై భారమంతా ఉంది. ఈ నేపథ్యంలో భారత్ ఎక్కువగా ప్రత్యర్థి బౌలర్ల శక్తిమీద కాకుండా, స్కోర్‌పై దృష్టి పెట్టాలని అశ్విన్ సూచించాడు. అలాగే, నాలుగో రోజుకూడా స్పిన్నర్లకు పెద్దగా సహకారం ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. జైస్వాల్ దూకుడే రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌కు కీలకమవుతుందని చెప్పారు. ఇక ‘లైక్ ఫర్ లైక్ సబ్‌స్టిట్యూట్’ నిబంధన గురించి చర్చ మొదలైంది. గతంలో రిషభ్ పంత్ గాయపడ్డప్పుడు ఇంగ్లాండ్ జాలీ చూపించలేదని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు భారత్ భారీ స్కోర్ చేయాలని కోరుతున్నారు.