ramya
రచయిత
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు
ramya
రచయిత
కాలిఫోర్నియాలో విస్తరిస్తున్న కార్చిచ్చు

అమెరికాలోని సెంట్రల్ కాలిఫోర్నియాలో ఈ నెల 1న ప్రారంభమైన గిఫోర్డ్ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు 65,000 ఎకరాలకు పైగా ఈ మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగతో పరిసర ప్రాంతాల గాలి నాణ్యత భారీగా పడిపోయింది. లాస్ ఏంజెలెస్, వెంచురా, కార్న్ జిల్లాలతో పాటు లాస్‌వేగాస్ ప్రజలను అప్రమత్తం చేశారు. శాంటామారియా వంటి ప్రాంతాల నుంచి ప్రజలను అక్కడి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. గాలి నాణ్యత తగ్గుతుండటంతో ప్రజలకు వివిధ సూచనలు కూడా జారీ చేశారు. అధికారులు మంటలను అదుపు చేయేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ సోమవారం నాటికి కేవలం 3% మాత్రమే నియంత్రణలోకి తీసుకువచ్చినట్లు సమాచారం. ముగ్గురు గాయపడగా, ఒకరి పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ప్రత్యేక వైద్యం కోసం విమానంలో తరలించారు. వాతావరణ శాఖ వచ్చే రోజుల్లో పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశముందని హెచ్చరిస్తోంది.