R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

చైన్ కోసం నకిలీ ఎన్నికల సిబ్బంది డ్రామా!

చైన్ కోసం నకిలీ ఎన్నికల సిబ్బంది డ్రామా!

చైన్ కోసం నకిలీ ఎన్నికల సిబ్బంది డ్రామా!

బీహార్‌లో ఓ వృద్ధ మహిళను మోసం చేసి నకిలీ ఎన్నికల సిబ్బంది బంగారు గొలుసు దోచుకుపోయిన ఘటన కలకలం రేపుతోంది. సరన్ జిల్లా నెరువా గ్రామంలో ఓటర్ల జాబితా సవరణ పేరుతో ఇంటికి వచ్చిన ఇద్దరు వ్యక్తులు, ఫొటో తీసేందుకు మెడలో ఉన్న గొలుసు తీయమని మహిళను కోరారు. అనంతరం ఆధార్ కార్డు చూపమంటూ గర్భంగా నిలిచి, పరుపు కింద పెట్టిన చైన్‌ను దొంగిలించి పరారయ్యారు. విషయం గ్రహించిన వృద్ధురాలి భర్త పోలీసులకు సమాచారం ఇచ్చగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం సీసీటీవీ ఫుటేజులు పరిశీలిస్తున్నారు. చెప్పుకుంటూ ఓటర్ల డేటా వేటలో ఉన్న అసలైన సిబ్బందికి ఇది పెద్ద హెచ్చరికగా మారింది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv news