ritesh
రచయిత
ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం – ఏడాది పాటు టోల్ ఛార్జీలపై భారీ తగ్గింపు!
ritesh
రచయిత
ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రారంభం – ఏడాది పాటు టోల్ ఛార్జీలపై భారీ తగ్గింపు!

వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,000తో ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్‌లకు మాత్రమే ఈ పాస్ వర్తించనుంది. దీన్ని రాజ్‌మార్గ్ యాత్ర యాప్ లేదా NHAI, రవాణా శాఖ వెబ్‌సైట్ల ద్వారా యాక్టివేట్ చేసుకోవచ్చు.ఈ పాస్‌తో ఏటా 200 టోల్ ట్రిప్పుల వరకు లేదా ఏడాది కాలం పాటు (ఏది ముందైతే అది) టోల్ చెల్లింపులు నుంచి విముక్తి లభిస్తుంది. ట్రిప్పుల లెక్క పాస్ చేసే టోల్‌గేట్ల ఆధారంగా ఉంటుంది. ఉదాహరణకి, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లి తిరిగితే 8 ట్రిప్పులుగా లెక్కిస్తారు.ఈ స్కీమ్ కొత్త ఫాస్టాగ్ అవసరం లేకుండా, ఇప్పటికే ఉన్న ఫాస్టాగ్‌తోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. 200 ట్రిప్పులు పూర్తైన తర్వాత మళ్లీ అదే ఫీజుతో పాస్ రిన్యూ చేసుకోవచ్చు. ఇది కచ్చితంగా తప్పనిసరి కాదు — కొద్దిగా ప్రయాణించే వారు సాధారణ ఫాస్టాగ్ విధానాన్నే కొనసాగించవచ్చు.ప్రస్తుతం టోల్ గేట్‌కు సగటున ₹50 చెల్లిస్తే, 200 ట్రిప్పులకు ₹10,000 ఖర్చవుతుంది. అదే వార్షిక పాస్‌తో ఈ మొత్తం కేవలం ₹3,000కి పరిమితం అవుతుంది. ఈ విధంగా ఒక్కో వాహనదారుడు సుమారుగా రూ.7,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.