R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తమిళనాడులో దారుణం – ముగ్గురు కుమార్తెల హత్య చేసి తండ్రి ఆత్మహత్య
R
ramya
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తమిళనాడులో దారుణం – ముగ్గురు కుమార్తెల హత్య చేసి తండ్రి ఆత్మహత్య

నామక్కల్ జిల్లా తిమ్మనాయకన్‌పట్టిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న గోవిందరాజ్ (35) అనే వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను హత్య చేసి అనంతరం ఆత్మహత్య చేసుకున్నారు. గోవిందరాజ్ భార్య భారతి, కుమారుడు అనీశ్వరన్ నిద్రిస్తున్న సమయంలో తలుపులకు గడియపెట్టి, హాల్లో పడుకున్న ప్రతిక్షాశ్రీ (10), రివత్తికాశ్రీ (7), దేవశ్రీ (6) అనే ముగ్గురు కుమార్తెల గొంతులు వేటకొడవలితో కోసి హత్య చేశాడు. అనంతరం పురుగుల మందు తాగి గోవిందరాజ్ ప్రాణాలు తీసుకున్నాడు. ఉదయం తలుపులు తెరుచుకోకపోవడంతో భారతి ఆందోళనకు గురై వాటిని బలవంతంగా తెరిచి లోపలికి వెళ్లగా, భయానక దృశ్యం చూసి షాక్‌కు గురైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోవిందరాజ్ అప్పుల భారం కారణంగా ఈ తీరైన చర్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
ట్యాగ్‌లు
LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news