yakub
రచయిత
రేవంత్‌పై కోర్టులో పోరాడతా: కేటీఆర్ మండిపాటు
yakub
రచయిత
రేవంత్‌పై కోర్టులో పోరాడతా: కేటీఆర్ మండిపాటు

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన అసత్య వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఢిల్లీలో రేవంత్ మీడియాతో మాట్లాడుతూ తాను డ్రగ్స్ కేసుల్లో ఉన్నట్లు చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నాపై డ్రగ్స్ కేసు ఉందని చెబుతారా? దానికి ఏ ఆధారాలైనా ఉన్నాయా? దమ్ముంటే ప్రజల ముందు నిజాలు బయటపెట్టండి. లేకపోతే కోర్టులోనే మిమ్మల్ని నిలదీస్తా. సీఎం పదవిలో ఉన్నవారు వ్యక్తిగత దూషణలకు దిగడం అసంబద్ధం. తప్పుపడితే మూల్యం చెల్లించుకోవాల్సిందే. క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు తప్పవు’’ అంటూ కేటీఆర్ హెచ్చరించారు. ఇక బనకచర్ల ప్రాజెక్టుపై సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు కూడా మండిపడ్డారు. తప్పును దాచేందుకు చిట్‌చాట్ పేరుతో తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. బనకచర్లపై తాను వేసిన సవాల్‌ను సీఎం ఎందుకు తీసుకోలేకపోయారో చెప్పాలన్నారు.