R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణలో ఐదు రోజుల వర్షాల అలర్ట్
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
తెలంగాణలో ఐదు రోజుల వర్షాల అలర్ట్

తెలంగాణలో రాబోయే ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా తీరానికి సమీపంలో అల్పపీడనం ఏర్పడి పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతుందని తెలిపింది. మంగళవారం: భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. బుధవారం: కొత్తగూడెం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు. గురువారం: ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వానలు, ఈదురుగాలులు. శుక్రవారం: హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు. శనివారం: ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi