R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ. 6 లక్షల జరిమానా విధించిన కోర్టు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఎర్రచందనం స్మగ్లర్లకు ఐదేళ్ల జైలు శిక్ష – రూ. 6 లక్షల జరిమానా విధించిన కోర్టు

తిరుపతి: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో 10 మందికి తిరుపతిలోని ఆర్‌ఎస్‌ఎస్ ఏడీజే కోర్టు కఠిన శిక్ష విధించింది. 2019లో పెరుమల్లపల్లి బీట్, టీఏన్ పాలెం సెక్షన్‌లో పట్టుబడిన స్మగ్లర్లకు ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.6 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి నరసింహమూర్తి తీర్పు వెల్లడించారు.ఈ కేసులో టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ పర్యవేక్షణలో, ఎస్‌టీఎఫ్ అధికారి ఎల్. సుబ్బారాయుడు సమర్పించిన పక్కా సాక్ష్యాల ఆధారంగా నిందితులను దోషులుగా నిర్దారించారు. నిందితులు తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై, వేలూరు జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.అయితే, నిందితుల్లో ఒకడు — ప్రభు — కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్‌బెయిలబుల్ వారంట్ జారీ చేశారు.ఈ తీర్పు ఎర్రచందనం అక్రమ రవాణాకు చెక్ పెట్టే దిశగా కీలకంగా మారనుంది.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi