R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

కావలిలోని సినిమా థియేటర్‌లో మంటలు – ప్రేక్షకుల్లో ఆందోళన

కావలిలోని సినిమా థియేటర్‌లో మంటలు – ప్రేక్షకుల్లో ఆందోళన

కావలిలోని సినిమా థియేటర్‌లో మంటలు – ప్రేక్షకుల్లో ఆందోళన

నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో బుధవారం ఉదయం స్రవంతి సినిమా థియేటర్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సినిమా ప్రదర్శన జరుగుతున్న సమయంలో ప్రొజెక్టర్ గదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనతో థియేటర్‌లో ఉన్న ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. విద్యుదాఘాతం వల్లే మంటలు వచ్చాయని భావిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రొజెక్టర్ గదిలోని పరికరాలు పూర్తిగా దగ్ధమవగా, థియేటర్‌లో తక్కువ మంది ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthicrime news