A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

అన్నవరం కొండపై కారులో మంటలు – భక్తులకు షాక్!

అన్నవరం కొండపై కారులో మంటలు – భక్తులకు షాక్!

అన్నవరం కొండపై కారులో మంటలు – భక్తులకు షాక్!

కాకినాడ జిల్లా అన్నవరం సత్యగిరిపై గురువారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. హరిహర సదన్ ఎదురుగా పార్క్ చేసిన సీఎన్‌జీ కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఖమ్మం నుంచి వచ్చిన భక్తులు ఆ కారు అక్కడ పార్క్ చేసి గదికి వెళ్లారు. అల్ప సమయంలోనే మంటలు పక్కకారులకు వ్యాపించే స్థితికి రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమయానికి మంటలు అదుపులోకి తీసుకువచ్చినప్పటికీ, కారుకు తీవ్ర నష్టం జరిగింది. పక్కనే ఉన్న మరో కారు యజమాని లేని కారణంగా అద్దాలు పగులగొట్టి హ్యాండ్ బ్రేక్ తీసి దాన్ని దూరంగా తరలించారు. అయితే అది కూడా కొంత మేర దెబ్బతింది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News TeluguAndhrapradeshkrtv newskrtv kranthitrending news