R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాష్ట్రంలో వరదలు ఉధృతం కాళేశ్వరం, భద్రాచలంలో ప్రమాద హెచ్చరికలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
రాష్ట్రంలో వరదలు ఉధృతం కాళేశ్వరం, భద్రాచలంలో ప్రమాద హెచ్చరికలు

రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం వద్ద ప్రాణహిత, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాగా, భద్రాచలంలో గోదావరి 48 అడుగులకు చేరడంతో రెండో హెచ్చరిక ఇచ్చారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లాలో గోదావరి ప్రవాహం పెరగడంతో జాతీయ రహదారి మునిగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. వాజేడు మండలంలో ఇళ్లు నీటమునిగిన నేపథ్యంలో కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు వరదలతో పంటలు దెబ్బతింటుండటంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాతావరణశాఖ ప్రకారం, రాబోయే రెండు రోజులు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi