ritesh
రచయిత
సరోగసీ పేరిట మోసం – దంపతులను మభ్యపెట్టిన ఫెర్టిలిటీ సెంటర్
ritesh
రచయిత
సరోగసీ పేరిట మోసం – దంపతులను మభ్యపెట్టిన ఫెర్టిలిటీ సెంటర్

సంతాన ఆశతో ఫెర్టిలిటీ సెంటర్లను ఆశ్రయించిన దంపతులను మోసం చేసిన సంఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. "యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్" పేరిట డాక్టర్ అత్తలూరి నమ్రత నేతృత్వంలో జరిగిన మోసాన్ని పోలీసులు బయటపెట్టారు. సరోగసీ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి, నిజంగా గర్భధారణ జరుగకపోయినా నకిలీ స్కానింగ్ రిపోర్టులతో బాధితులకు నమ్మకం కలిగించారన్నది విచారణలో తేలింది.పేద కుటుంబాల నుంచి పిల్లలను కొనుగోలు చేసి, సరోగసీ ద్వారా పుట్టినవారిగా చూపించి దంపతులకు అప్పగిస్తూ డబ్బులు తీసుకునేవారు. బాధితుల నుంచి 20 నుంచి 40 లక్షల వరకు వసూలు చేయడంతో పాటు, హార్మోన్ ఇంజెక్షన్ల పేరుతో అదనపు ఖర్చు వేయించేవారు.ఇప్పటివరకు 25 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, ఈ కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్ ఎస్‌ఐటీకి బదిలీ చేశారు. ప్రధాన నిందితురాలు నమ్రతపై తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే 15 కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న ఏజెంట్లతో కలిసి శిశు విక్రయ ముఠా తరహాలో ఈ మోసాలు సాగించారు.