A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముఖ్యమైన వివరాలు ఇవే!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముఖ్యమైన వివరాలు ఇవే!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – ముఖ్యమైన వివరాలు ఇవే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రారంభించనుంది. ఈ పథకం ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణాలకు పరిమితం కానుంది. అంటే, జిల్లా సరిహద్దులలో ఉండే ప్రయాణాలకే ఉచితం వర్తిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్టీసీ వద్ద 11,449 బస్సులు ఉన్నాయి. ఇందులో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ బస్సులు ఎక్కువగా జిల్లా పరిధిలో తిరుగుతున్నాయి. మొత్తం 8,458 బస్సులు ఈ పథకానికి ఉపయోగపడనున్నాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ పథకం వల్ల రోజు పాటు 10.84 లక్షల మంది కొత్తగా ప్రయాణిస్తారు, మొత్తంగా 26.95 లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంది. దీనివల్ల ఆర్టీసీపై నెలకు రూ.242 కోట్ల భారం పడనుంది. ప్రస్తుతం పథకం గ్రామీణ, సిటీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు మాత్రమే వర్తించనుంది. చివరి నిర్ణయం త్వరలో అధికారికంగా వెలువడనుంది.

ట్యాగ్‌లు

TrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitrending news