A

ashok

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సనత్‌నగర్‌లో ఫ్రిజ్ పేలుడు.. ప్రమాదం తప్పింది

సనత్‌నగర్‌లో ఫ్రిజ్ పేలుడు.. ప్రమాదం తప్పింది

సనత్‌నగర్‌లో ఫ్రిజ్ పేలుడు.. ప్రమాదం తప్పింది

హైదరాబాద్‌ నగరంలోని సనత్‌నగర్‌ రాజరాజేశ్వరి నగర్‌లో గురువారం ఉదయం ఒక ఇంట్లో రిఫ్రిజిరేటర్‌ పేలి ప్రమాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్రిజ్ ఒక్కసారిగా పేలి మంటలు చెలరేగాయి. సామాగ్రి దగ్ధమయ్యింది, అయితే ప్రాణ నష్టం జరగకపోవడం ఊపిరి పీల్చుకునే విషయమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రాంత ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంఘటన స్థలానికి వచ్చి బాధితులను పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

ట్యాగ్‌లు

Kranthi News Telugukrtv newskrtv kranthitelagnanacrime news