ritesh
రచయిత
విధ్వంసం నుంచి వికాసం వైపు సాగుతున్నాం: సీఎం చంద్రబాబు
ritesh
రచయిత
విధ్వంసం నుంచి వికాసం వైపు సాగుతున్నాం: సీఎం చంద్రబాబు

79వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా సీఎం చంద్రబాబు శుక్రవారం (ఆగస్ట్ 15) సంచలన వ్యాఖ్యలు చేశారు. సూపర్ సిక్స్ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్లు, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు. వైసీపీ హయాంలో నిలిపిన పథకాలను తిరిగి ప్రారంభించామని చెప్పారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం రాజకీయ నాటకాలు ఆడిందని విమర్శించారు.కొంతమంది రాజకీయ ముసుగులో నేరాలకు ప్రోత్సాహం ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, వాటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.పేదల భూములకు రక్షణ కల్పిస్తూ, రెవెన్యూ అక్రమాలను సవరించామని చెప్పారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న వరద నీటిని ఉపయోగించుకుంటే ఎగువ రాష్ట్రాలకు ఇబ్బంది ఉండదని, అదే నీటిని వాడితే అభ్యంతరం చెప్పడం తగదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.