Y

yakub

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఏనుగు దాడిలో గేమ్ రిజర్వ్ సీఈఓ మృతి

ఏనుగు దాడిలో గేమ్ రిజర్వ్ సీఈఓ మృతి

ఏనుగు దాడిలో గేమ్ రిజర్వ్ సీఈఓ మృతి

దక్షిణాఫ్రికాలోని గోండ్వానా ప్రైవేట్ గేమ్ రిజర్వ్‌లో ఏనుగు దాడిలో సహ యజమాని మరియు సీఈఓ ఎఫ్‌సీ కాన్రాడీ (వయస్సు 39) దుర్మరణం పాలయ్యారు. సమాచారం ప్రకారం, టూరిస్టు ప్రాంతానికి దూరంగా ఏనుగుల గుంపును పక్కకు తరలించే ప్రయత్నంలో ఉన్న సమయంలో, ఒక ఏనుగు దాడి చేసి ఆయనను దంతాలతో ఢీకొట్టి తొక్కినట్లు తెలుస్తోంది. అక్కడే ఉన్న సిబ్బంది రక్షించేందుకు ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. ఈ రిజర్వ్ ఫైవ్‌స్టార్ సఫారీ లాడ్జిగా ప్రసిద్ధి చెందగా, గతేడాది కూడా ఇలాంటి ఘటన అక్కడ చోటుచేసుకుంది. వరుస ఘటనల నేపథ్యంలో గేమ్ రిజర్వ్‌ల భద్రతపై చర్చ మొదలైంది.

ట్యాగ్‌లు

Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi