krtv
రచయిత
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా
krtv
రచయిత
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై తిరుమల తిరుపతిలో ఉచితంగా

గత కొంత కాలంగా భక్తుల నుంచి ప్రైవేట్ వాహనదారులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని.. ఈ దోపిడీని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ఈ చర్యల వలన రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, ప్రైవేట్ రవాణా నిర్వాహకులు అధిక ఛార్జీలను అరికట్టవచ్చునని భావిస్తున్నామని చెప్పారు. తిరుపతి -తిరుమల మధ్య తిరిగే బస్సులతో పాటు.. తిరుమలలోని ఇతర ముఖ్య ప్రాంతాలకు వెళ్లాలనుకునే భక్తులకు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నామని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆర్టీసీ అధికారులతో మాట్లాడినట్లు.. ఈ సేవలను ఉచితంగా అందించడానికి ఆర్టీసీ అధికారులు ఓకే చెప్పారని తెలిపారు. ఈ సేవల్లో భాగంగా మొదటి దశలో దాదాపు 150 బస్సులు అందుబాటులోకి వస్తాయి అన్నారు. టిటిడి ఇప్పటికే ఉచిత సేవలను అందించే పరిమిత సంఖ్యలో ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతోంది. ఎపిఎస్‌ఆర్‌టిసి బస్సులను చేర్చడం వల్ల ప్రైవేట్ టాక్సీలపై ఆధారపడటం గణనీయంగా తగ్గుతుందని భావిస్తున్నారు.