R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ప్రయాణికులకు శుభవార్త: చర్లపల్లి-ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్ల సేవలు

ప్రయాణికులకు శుభవార్త: చర్లపల్లి-ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్ల సేవలు

ప్రయాణికులకు శుభవార్త: చర్లపల్లి-ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్ల సేవలు

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం చర్లపల్లి–ధర్మవరం మధ్య 14 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్లు ఆదివారం నుంచి ఈ నెల 28 వరకు నడవనున్నాయి. చర్లపల్లి నుంచి ధర్మవరం (07003) రైలు ప్రతి ఆదివారం రాత్రి 7:55కు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలకు చేరుతుంది. ధర్మవరం నుంచి చర్లపల్లి (07004) రైలు ప్రతి సోమవారం సాయంత్రం 4:40కు బయలుదేరి, మంగళవారం సాయంత్రం 6:30కు గమ్యస్థానానికి చేరుతుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తిరుపతి, రేణిగుంట తదితర స్టేషన్లలో ఆగుతాయి. ఫస్ట్ ఏసీ నుంచి జనరల్ కోచ్ వరకు అన్ని తరగతుల Bogies అందుబాటులో ఉంటాయని రైల్వే తెలిపింది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi