ritesh
రచయిత
32 ఏళ్లుగా జీతం లేకుండా ట్రాఫిక్ విధుల్లో తాత – వెనక హృదయాన్ని తాకే విషాదకథ
ritesh
రచయిత
32 ఏళ్లుగా జీతం లేకుండా ట్రాఫిక్ విధుల్లో తాత – వెనక హృదయాన్ని తాకే విషాదకథ

దిల్లీ సీలంపూర్ జంక్షన్‌లో ప్రతి ఉదయం 8 గంటలకే ట్రాఫిక్ యూనిఫామ్‌లో కనిపించే ఓ వృద్ధుడు ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటారు. ఆయన పేరే గంగారామ్ (వయస్సు 72). నిజానికి ఆయన పోలీసు కార్మికుడు కాదు. అయినా గత 32 ఏళ్లుగా ట్రాఫిక్ నియంత్రణలో నిరంతరంగా సేవలందిస్తున్నారు – అది కూడా ఒక్క పైసా జీతం లేకుండా. గంగారామ్ కొడుకు కొన్ని సంవత్సరాల క్రితం అదే జంక్షన్‌లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ సంఘటన తర్వాత ఆయన భార్య కూడా శోకంతో మృతిచెందారు. జీవితాన్ని కోల్పోయిన గంగారామ్, మరొక కుటుంబం తనలాంటి బాధను అనుభవించకూడదన్న తాలూకూ సంకల్పంతో, అదే చోట ట్రాఫిక్ కంట్రోల్ చేయడం మొదలుపెట్టారు. పోలీసు అధికారుల గుర్తింపు లేకుండా స్వచ్ఛందంగా సాగిన ఈ సేవను 2018లో దిల్లీ ట్రాఫిక్ శాఖ గుర్తించి, “ట్రాఫిక్ సెంటినల్”గా అధికారిక గుర్తింపు ఇచ్చింది. కరోనా కాలంలో కూడా తన విధులకు దూరం కాలేదు. ఇటీవల గంగారామ్ కథ ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారి, నెటిజన్ల హృదయాలను కదిలించింది.