R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గ్రేటర్‌లో చెత్త కుప్పల వేధింపు.. ప్రజల ఆగ్రహం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
గ్రేటర్‌లో చెత్త కుప్పల వేధింపు.. ప్రజల ఆగ్రహం

హైదరాబాద్ నగరంలో చెత్త సమస్య తీవ్రతరంగా మారింది. బస్తీలు, కాలనీలు, రహదారులపై చెత్త కుప్పలు గుట్టలు గుట్టలుగా kపేరుకుపోతున్నాయి. వర్షాల సమయంలో ఈ చెత్త దుర్వాసనతో పాటు దోమలు, ఈగల పెరుగుదలకు కారణమవుతోంది. డెంగీ, మలేరియా వంటి వ్యాధుల భయంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నా, మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. పారిశుధ్యంపై మేయర్, కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపకపోవడం వల్ల సమస్య మరింత ముదిరింది. గతంలో తొలగించిన చెత్త గుంపుల వద్దనే ప్రజలు మళ్లీ చెత్త వేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోలు రాకపోవడం, డంపర్ బిన్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రజలు అల్లాడిపోతున్నారు. నగరంలోని ప్రతీ మూలన ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజలు బల్దియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi