ritesh
రచయిత
ఆసియా కప్ జట్టు ఎంపికకు ముందే సెలెక్టర్లకు తలనొప్పి!
ritesh
రచయిత
ఆసియా కప్ జట్టు ఎంపికకు ముందే సెలెక్టర్లకు తలనొప్పి!

సెప్టెంబర్ 9 నుంచి యూఏఈలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా ఎంపికపై బీసీసీఐ సెలెక్షన్ కమిటీకి కఠినమైన పరీక్ష ఎదురవుతోంది. ఆగస్ట్ 19 లేదా 20 తేదీల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఆటగాళ్ల ఫిట్‌నెస్ నివేదికల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.గాయాల నుంచి కోలుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ ఇప్పటికే నెట్స్‌లో సాధన చేస్తుండటంతో ఆయనతో పాటు హార్దిక్ పాండ్య, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ వంటి ఆటగాళ్ల ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది.అయితే శుభ్‌మన్ గిల్‌కి స్థానం కల్పించడం సెలెక్టర్లకు సవాలుగా మారింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ లాంటి యువ బ్యాటర్లను ఎక్కడ ఆడించాలన్న దానిపై స్పష్టత రాలేదు. వికెట్ కీపర్ ఎంపికలో జితేశ్ శర్మ, ధ్రువ్ జురేల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.బౌలింగ్ విభాగంలో బుమ్రా, అర్షదీప్ ఎంపిక ఖాయం కాగా, ప్రసిద్ధ్ కృష్ణ లేదా హర్షిత్ రాణాల్లో ఒకరు మాత్రమే ఎంపిక అవుతారు. స్పిన్ ఆల్‌రౌండర్లలో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ చోటు దక్కించుకునే అవకాశం ఉంది.ఓవరాల్‌గా ఈసారి టీమ్ ఎంపిక పూర్తిగా ఫిట్‌నెస్, ప్రస్తుత ఫామ్, సమతుల్యతల ఆధారంగా జరగనుంది.