R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వరంగల్, హనుమకొండలో భారీ వర్షం – లోతట్టు ప్రాంతాలు జలమయం
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
వరంగల్, హనుమకొండలో భారీ వర్షం – లోతట్టు ప్రాంతాలు జలమయం

వరంగల్, హనుమకొండ, కాజీపేటలో సోమవారం అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. బస్టాండ్, చౌరస్తా, పాత బీటు బజార్, హంటర్ రోడ్, కరీమాబాద్, శివనగర్ వంటి ప్రాంతాల్లో రహదారులపై నీరు నిలిచిపోయింది. డీకే నగర్‌లో ఇళ్లలోకి నీరు చేరడంతో కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.సంగెం, ఖిల్లా వరంగల్, వర్ధన్నపేట, పర్వతగిరి, గీసుకొండ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోనూ నీరు నిలిచింది. మహబూబాబాద్ జిల్లాలో వాగులు పొంగిపోర్లుతున్నాయి. కొత్తగూడ, దంతాలపల్లి ప్రాంతాల్లో వాగులపై వంతెనల ద్వారా రాకపోకలు నిలిచిపోయాయి.అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthitelagnana