Lahari
రచయిత
తెలంగాణలో వచ్చే కొన్ని రోజులు భారీ వర్షాలు – IMD హెచ్చరిక
Lahari
రచయిత
తెలంగాణలో వచ్చే కొన్ని రోజులు భారీ వర్షాలు – IMD హెచ్చరిక

హైదరాబాద్: తెలంగాణలో రాబోయే నాలుగు రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. బుధవారం కొన్ని ప్రాంతాల్లో గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, గురువారం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని, శుక్రవారం కూడా కొన్ని జిల్లాల్లో భారీ వర్షాల అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.