S

sairam

రచయిత

1 నిమిషాలు చదవడానికి

సినీ నటుడు ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సహాయం.. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం అంటూ హామీ

సినీ నటుడు ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సహాయం.. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం అంటూ హామీ

సినీ నటుడు ఫిష్ వెంకట్‌కు హీరో ప్రభాస్ సహాయం.. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం అంటూ హామీ

ఆది, దిల్, మిరపకాయ్, గబ్బర్ సింగ్ వంటి చిత్రాల్లో విలన్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు ఫిష్ వెంకట్. ప్రస్తుతం ఆయన తీవ్ర అనారోగ్య సమసమ్యలతో బాధపడుతూ లేవలేని పరస్థితిలో హాస్పటల్‌లో బెడ్‌పై చికిత్స పొందుతున్నాడు. వెంకట్ కుటుంబం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. దాతల సహాయం కోసం మీడియా ద్వారా వేడుకున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలియగానే రీసెంట్ పవన్ కల్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇప్పుడు ఫిష్ వెంకట్‌కు సహాయం చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చాడు. రీసెంట్‌గా మరోసారి మీడియాతో మాట్లాడిన వెంకట్ కూతురు ఈ విషయాన్ని తెలియజేశారు. ‘నాన్న పోజిషన్ బాగోలేదు. ICUలో చాలా సీరియస్ పోజిషన్‌లో ఉన్నారు. కిడ్ని కచ్చితంగా కావాలి. మా ఇంట్లో వాళ్ల బ్లెడ్‌తో నాన్నది మ్యాచ్ అవ్వడం లేదు. కిడ్ని ట్రాన్సఫర్ చేయడానికి రూ. 50 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్స్ చెప్పారు’ అని తెలిపారు. ఇండస్ట్రీ నుంచి మీకు ఎలాంటి కాల్స్ రాలేదా అని రిపోర్టర్ ప్రశ్నించగా.. ‘ప్రభాస్ అసిస్టెంట్ కాల్ చేసి.. కిడ్నీ ఇచ్చే డోనర్ (దాత) ఉంటే ఏర్పాట్లు చేసుకోండి. ఆపరేషన్‌కు కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాం’ అని చెప్పినట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

Cinema