ritesh
రచయిత
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు స్పందన
ritesh
రచయిత
బంజారాహిల్స్ పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు స్పందన

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి కూల్చివేతపై హైకోర్టు గురువారం (ఆగస్టు 14) విచారణ జరిపింది. ఆలయంలోని విగ్రహాల భద్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెద్దమ్మ తల్లి విగ్రహాన్ని సురక్షితంగా ఉంచాలని అధికారులను ఆదేశించింది.అలాగే గుడి కూల్చివేతకు సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.పిటిషనర్ వినోద్ కుమార్ ఆలయాన్ని తిరిగి నిర్మించాలని కోరుతూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆలయ కూల్చివేతపై హైకోర్టు చర్యలు చేపట్టింది.ఇక పెద్దమ్మ గుడి కూల్చివేతకు నిరసనగా హిందూ సంఘాలు పూజ కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో బంజారాహిల్స్ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. రహదారులను మూసివేసి ఆ ప్రాంతాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు.