ritesh
రచయిత
దీపావళికి ముందు జీఎస్టీలో భారీ మార్పులు: ఇక రెండు శ్లాబు రేట్లే!
ritesh
రచయిత
దీపావళికి ముందు జీఎస్టీలో భారీ మార్పులు: ఇక రెండు శ్లాబు రేట్లే!

జీఎస్టీ వ్యవస్థలో బడా మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. దీపావళి నాటికి నిత్యవసర వస్తువులపై పన్నులు తగ్గించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో వినియోగదారులకు ఊరట కలుగనుందని తెలిపారు.ప్రస్తుతం అమల్లో ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబుల స్థానంలో ఇకపై కేవలం రెండు శ్లాబులే ఉండనున్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొన్ని ప్రత్యేక ఉత్పత్తులకు మాత్రమే భిన్నమైన రేట్లు వర్తిస్తాయని తెలిపింది.79వ స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, జీఎస్టీ వ్యవస్థలో ఎనిమిదేళ్లలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రాల సహకారంతో తదుపరి దశ మార్పులు చేపడుతున్నామని, ఇది సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు.‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంగా నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను హేతుబద్ధీకరణ, జీవన వ్యయాల తగ్గింపు అనే మూడు కీలక స్తంభాలపై జీఎస్టీ బ్లూప్రింట్ రూపొందించామని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.జీఎస్టీ కౌన్సిల్ వేదికగా త్వరలో ఈ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సెప్టెంబర్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం జరగనుంది.