R

ritesh

రచయిత

1 నిమిషాలు చదవడానికి

నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తివేత

నాగార్జునసాగర్‌కు భారీ వరద.. 20 గేట్లు ఎత్తివేత

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడంతో అధికారులు శనివారం 20 క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,99,544 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 1,86,860 క్యూసెక్కులుగా ఉంది.డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ప్రకృతి అందాలు తిలకించేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 589.40 అడుగులు ఉండగా, పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు.నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుత నిల్వ 310.510 టీఎంసీలుగా ఉంది. జలవిద్యుత్ ఉత్పత్తి కూడా యథావిధిగా కొనసాగుతోంది.

ట్యాగ్‌లు

LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi