L

Lahari

రచయిత

1 నిమిషాలు చదవడానికి

బాహుబలి రీ-రిలీజ్ కు భారీ ప్లాన్!

బాహుబలి రీ-రిలీజ్ కు భారీ ప్లాన్!

బాహుబలి రీ-రిలీజ్ కు భారీ ప్లాన్!

టాలీవుడ్‌లో రీ-రిలీజ్‌ల ట్రెండ్ జోరుగా కొనసాగుతున్న వేళ, ‘బాహుబలి’ కూడా మళ్లీ తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలై 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా, బాహుబలి 1, 2 భాగాలను కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’ పేరిట 2025 అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఈ స్పెషల్ ఎడిషన్‌ను సుమారు మూడున్నర గంటల నిడివిలో ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. పాత పాటలు, కొంత ఫుటేజ్ తొలగించి, కొత్తగా డిలీటెడ్ సీన్స్‌ జోడించనున్నారు. రీ-రిలీజ్ కోసం కొత్త సర్టిఫికేట్ తీసేందుకు సెన్సార్‌కు పంపించనున్నారు. ఇప్పటి వరకు రీ-రిలీజ్ సినిమాల్లో ‘సనమ్ తేరీ కసమ్’, ‘తుంబాద్’, ‘మురారి’, ‘ఖలేజా’ మంచి వసూళ్లు రాబట్టగా, ఇప్పుడు ‘బాహుబలి: ది ఎపిక్’ ₹40-₹50 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీగా హైప్ నెలకొంది.

ట్యాగ్‌లు

CinemaLatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi