ritesh
రచయిత
చైనాలో హ్యూమనాయిడ్ రోబో ఒలింపిక్స్ – మానవ రూప రోబోలు క్రీడలలో మెరుపులు!
ritesh
రచయిత
చైనాలో హ్యూమనాయిడ్ రోబో ఒలింపిక్స్ – మానవ రూప రోబోలు క్రీడలలో మెరుపులు!

చైనాలో తొలిసారిగా హ్యూమనాయిడ్ రోబోల కోసం ప్రత్యేకంగా ఒలింపిక్ తరహా క్రీడలు నిర్వహించారు. "వరల్డ్ హ్యూమనాయిడ్ రోబో గేమ్స్" పేరుతో జరిగిన ఈ విశేష ఈవెంట్‌లో 16 దేశాల నుంచి 280 జట్లు పాల్గొన్నాయి.రోబోలు ఇందులో ఫుట్‌బాల్, స్ప్రింట్, బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ వంటి క్రీడలతో పాటు ఔషధాల గుర్తింపు, క్లీనింగ్, లాజిస్టిక్స్ పనులు వంటి విభాగాల్లో కూడా తమ ప్రతిభను ప్రదర్శించాయి.ఈ పోటీల్లో అమెరికా, జర్మనీ, బ్రెజిల్, జపాన్ దేశాల నుంచి వచ్చిన 192 విశ్వవిద్యాలయాలు, 88 ప్రైవేటు సంస్థలు పాల్గొన్నాయి. చైనాకు చెందిన యూనిట్రీ, ఫోరియర్ సంస్థలు తమ రోబోలను పోటీకి తీసుకువచ్చాయి.ఈ కార్యక్రమం బీజింగ్ మున్సిపల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగింది. ఇది చైనా చేపట్టిన AI, ఆటోమేషన్ అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఉంది. గత ఏడాది చైనా ఈ రంగంలో 20 బిలియన్ డాలర్లు వెచ్చించగా, భవిష్యత్తులో 137 బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం యోచిస్తోంది.