Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భార్యను బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వాధికారి భర్త
Y
yakub
రచయిత
1 నిమిషాలు చదవడానికి
భార్యను బ్లాక్‌మెయిల్ చేసిన ప్రభుత్వాధికారి భర్త

పుణె అంబేగావ్‌లో ఓ ప్రభుత్వ అధికారి తన భార్యను వ్యక్తిగతంగా వేధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. క్లాస్ 1 అధికారిణిగా పని చేస్తున్న ఆమె, భర్తకు సంబంధించిన వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నానం సమయంలో ఆమెను రహస్యంగా వీడియోలు తీయడంతో పాటు, అవి బయటపెడతానంటూ రూ.1.5 లక్షలు తీసుకురావాలని ఆమెను భర్త బలవంతం చేశాడని తెలిపారు. ఇంటి ఖర్చులు, రుణాల పేరిట భార్యను ఒత్తిడికి గురిచేయడంతో పాటు, రోజూ మానసిక, శారీరక హింసలు పెడుతున్నాడని బాధితురాలు వాపోయారు. భర్త కుటుంబసభ్యుల నుంచి కూడా వేధింపులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సాంకేతిక ఆధారాలతో పాటు వీడియో ఫుటేజ్‌లను కూడా దర్యాప్తు చేస్తున్నారు.
ట్యాగ్‌లు
Kranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi