Lahari
రచయిత
ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్ – రెండు పాయింట్లు కోత, జరిమానా
Lahari
రచయిత
ఇంగ్లండ్‌కు ఐసీసీ షాక్ – రెండు పాయింట్లు కోత, జరిమానా

లార్డ్స్‌లో భారత్‌పై గెలిచినప్పటికీ, ఇంగ్లండ్‌కు ఐసీసీ నుంచి ఎదురుదెబ్బ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇంగ్లండ్ జట్టుకు ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో రెండు పాయింట్ల కోత విధించడంతో పాటు, మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత సమయానికి రెండు ఓవర్లు తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్‌సన్ నిర్ధారించారు. ఐసీసీ ప్రవర్తనా నియమావళి సెక్షన్ 2.22 ప్రకారం, ప్రతి ఆలస్యం అయిన ఓవర్‌కు 5% ఫీజు, ప్రతి ఓవర్‌కు ఒక పాయింట్ కోత విధిస్తారు. దీంతో ఇంగ్లండ్ పాయింట్లు 24 నుంచి 22కి తగ్గి, పాయింట్ల శాతం 66.67 నుంచి 61.11కి పడిపోయింది. ఫలితంగా శ్రీలంక రెండో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, భారత్ నాలుగో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన తప్పును అంగీకరించడంతో ఈ విషయంపై విచారణ అవసరం లేదని ఐసీసీ తెలిపింది. ఈ చర్యలకు పాల్ రీఫెల్, షరఫుద్దుల్లా, అహ్సాన్ రజా, గ్రాహం లాయిడ్ అంపైర్లుగా ఉన్నారు.