R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు: జవాన్ మృతి, ముగ్గురికి గాయాలు
R
ritesh
రచయిత
1 నిమిషాలు చదవడానికి
ఛత్తీస్‌గఢ్‌లో ఐఈడీ పేలుడు: జవాన్ మృతి, ముగ్గురికి గాయాలు

ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ సమయంలో సోమవారం ఉదయం (ఆగస్ట్ 18) జరిగిన మందుపాతర పేలుడులో డిఆర్జీ (DRG)కి చెందిన ఓ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ పేలుడులో మరో ముగ్గురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.ఈ ఘటన ఇంద్రావతి నేషనల్ పార్క్ పరిసరాల్లో చోటుచేసుకుంది. నక్సలైట్లు అమర్చిన ఐఈడీ ఊహించని సమయంలో పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.ఈ ఆపరేషన్‌లో DRGతో పాటు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) బృందాలు కూడా పాల్గొన్నాయి. గత కొద్ది రోజులుగా ఈ ప్రాంతంలో నక్సలైట్లు ఐఈడీలను అమర్చి దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో బీజాపూర్, సుక్మా జిల్లాల్లో ఇలాంటి ఘటనలు మరింతగా పెరిగాయి.
ట్యాగ్‌లు
LatestTrendingKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi