R

ramya

రచయిత

1 నిమిషాలు చదవడానికి

ఇందౌర్‌లో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ నిబంధన – ఆగస్టు 1 నుంచి అమలు

ఇందౌర్‌లో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ నిబంధన – ఆగస్టు 1 నుంచి అమలు

ఇందౌర్‌లో ‘హెల్మెట్ లేకుంటే పెట్రోల్ లేదు’ నిబంధన – ఆగస్టు 1 నుంచి అమలు

ట్రాఫిక్ ఉల్లంఘనలను నియంత్రించేందుకు మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్ జిల్లాలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా పెట్రోల్ బంకులకు వచ్చినా, వారికి ఇంధనం ఇవ్వరని అధికారులు స్పష్టం చేశారు. ఈ నియమం ఆగస్టు 1 నుండి అమల్లోకి రానుంది. రోడ్డు భద్రతపై మంగళవారం జరిగిన సమీక్షలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభయ్ మనోహర్ సప్రే సూచనలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందౌర్ జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ ప్రకారం, హెల్మెట్ లేకుండా వచ్చినవారికి పెట్రోల్ ఇవ్వటం తప్పు, అందువల్ల సంబంధిత బంకులపై చర్యలు తప్పవన్నారు. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే సంబంధిత పెట్రోల్ బంకు యాజమాన్యంపై జైలు శిక్ష లేదా రూ.5,000 జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది. ఇందౌర్‌ను 'క్లీన్ సిటీ'గా నిలిపేందుకు తీసుకుంటున్న చర్యల్లో ఇది భాగంగా ఉంది.

ట్యాగ్‌లు

LatestKranthi NewsKranthi News Telugukrtv newskrtv kranthi