ritesh
రచయిత
భరతమాత గుడి గురించి సంక్షిప్తంగా వివరాలు
ritesh
రచయిత
భరతమాత గుడి గురించి సంక్షిప్తంగా వివరాలు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, వారణాసిలో భరతమాత గుడి ఉంది. దీనిని స్వాతంత్ర్య సమరయోధుడు బాబు శివప్రసాద్ గుప్తా నిర్మించారు. 1936లో మహాత్మా గాంధీ ఈ గుడిని ప్రారంభించారు. గుడిలో దేవతా విగ్రహాలకూ బదులు అఖండ భారతదేశం మోడలుగా తెల్లటి మార్బుల్‌తో తయారైన మ్యాప్ ఉంటుంది. ఇందులో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, నేపాల్, బర్మా, శ్రీలంక వంటి ప్రాంతాలూ కనిపిస్తాయి.ప్రత్యేకతగా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవాల రోజు నదుల్లో నీరు ప్రవహించేలా చేస్తారు. మైదాన ప్రాంతాలు పువ్వులతో అలంకరిస్తారు.ఇలాంటివే హరిద్వార్ (ఉత్తరాఖండ్), ఉజ్జయిని (మధ్యప్రదేశ్), కన్యాకుమారి (తమిళనాడు)లో కూడా భరతమాత గుడులు ఉన్నాయి.ఇక గాంధీ గుడులు కూడా దేశంలోని కొన్ని చోట్ల ఉన్నాయి — ఒడిశాలో బెర్హంపూర్, సంబల్పూర్, తెలంగాణలో పెద్ద కాపర్తి, ఏపీలో శ్రీకాకుళం, కర్ణాటకలో నిడఘట్టు, యుపిలో ఆగ్రా, లంకాలో వల్లీపురం వంటి ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలతో గుడులు ఉన్నాయి. కొన్నిచోట్ల భగత్ సింగ్, బోస్, తిలక్ విగ్రహాలు కూడా కనిపిస్తాయి.